calender_icon.png 16 November, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్కీ షా బంజారాకు భారత రత్న ఇవ్వాలి

16-11-2025 12:00:00 AM

  1. లక్కీ షా విగ్రహాన్ని పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి

తెలంగాణ గోర్ సేన అధ్యక్షుడు ధరావత్ రాందాస్ నాయక్

ముషీరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): ఢిల్లీలోని బంజారా సమాజం కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప మహనీయుడు లక్కీ షా బంజారాకు భారత రత్నతో పాటు ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ గోర్ సేన అధ్యక్షుడు ధరావత్ రాందాస్ నాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దశల వారి గా ఉద్యమం చేపడు తామని హెచ్చరించారు.

ఖండ భారత దేశంలోని ప్రముఖ వ్యాపారుల్లో లక్కీ షా ఒకరని గుర్తు చేశారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్కీ షా జీవిత చరిత్రను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాం శాల్లో చేర్చాలన్నారు. ముఖ్యంగా గోరు బోలి భాషాను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో పెట్టాలని కోరారు.

ఆయన 1675లో నవంబర్ 24-25 తేదీల్లో ఢిల్లీ నగరాన్ని వీడారని, ఆ రోజును పురస్కరిం చుకుని అన్ని తండా ల్లో, నగరాల్లో లక్కీ షా బంజారా భోగ్ భండారో పూజ కార్యక్రమం, జీవిత చరిత్రపై తండాల్లో చదువుకునే యువకులు ఉద్యోగస్తులు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోర్ సేన నాయకులు రాజు నాయక్, తిరుపతి నాయిక్, హరిలాల్ నాయక్, రమేష్ రాథోడ్, శ్రీనివాస్ నాయక్, సునీల్ నాయక్, రాజు చౌహాన్, సూర్య ప్రకాష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.