30-01-2026 02:11:11 PM
శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో స్వచ్ఛభారత్.
పెద్ద ఎత్తున పాల్గొన్న ఆర్యవైశ్యులు.
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ వద్ద శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా మాహత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించడం జరిగింది , స్వాతంత్రం తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ సేవలను ఆర్యవైశ్య సంఘం నాయకులు కొనియాడారు, అనంతరం శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఆవరణ లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.... చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలు శుభ్రపరచడం జరిగింది, పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి వనిత క్లబ్, వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కొమురవెల్లి రామ్మూర్తి , వాసవి మాత దేవాలయం చైర్మన్ చకిలం మారుతి, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, ప్రధాన కార్యదర్శి తొడుపునూరి రాజేందర్ ప్రసాద్, కోశాధికారి కొమురవెల్లి (కేబి) శ్రీనివాస్, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ అల్లంకి హరీష్ , సామాజిక సేవకులు నార్ల శ్రీనివాస్, వాసవి వనిత మహిళా క్లబ్ అధ్యక్షురాలు ఎల్లంకి విజయ, ప్రధాన కార్యదర్శి నార్ల మాధవి, కోశాధికారి కొమురవెల్లి చంద్రకళ , వాసవి క్లబ్ అధ్యక్షులు రామిడి రవీందర్, ప్రధాన కార్యదర్శి సముద్రాల శ్రావణ్ కుమార్ , కోశాధికారి పుల్లూరి రమేష్ , పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు బాదం వాని, క్యాషియర్ కొమురవెల్లి చంద్రకళ, సుల్తానాబాద్ పట్టణ అవోపా అధ్యక్షులు కొమురవెల్లి కాశీపతి, క్యాషియర్ కొమురవెల్లి శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పల్ల సురేష్ , పల్ల అశోక్, కాసం భూమన్న, రామిడి శ్రీనివాస్ , అల్లంకి అరుణ్ కుమార్, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, అంతకు ముందు వాసవి మాత దేవాలయం లో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది, పూజారి వల్ల కొండ మహేష్ తీర్థ ప్రసాదాలు అందజేశారు....