calender_icon.png 30 January, 2026 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు

30-01-2026 02:09:12 PM

జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్. 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ తో కలిసి రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రమాదకర ప్రాంతాల్లో సూచిక బోర్డులు, డైవర్షన్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని, పాఠశాల బస్సుల ఫిట్‌నెస్ తనిఖీలు కఠినంగా నిర్వహించాలని సూచించారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.