30-01-2026 02:07:20 PM
మా నాయకుడు శ్రీధర్ బాబు కూడా గాంధీయవాది
మంథని లో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్
మంథని,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ సత్యం, అహింసా మార్గంలో చేసిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తినిచ్చిందని, మంథని లో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ అన్నారు. శుక్రవారం అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి మంథని ఏఎంసీ చైర్మన్ కుడుదల వెంకన్న తో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ... మహాత్మా గాంధీ సత్యం, అహింసా మార్గంలో పోరాటం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును ఇచ్చిందని, గాంధీజీ స్పూర్తితో మా నాయకుడు మన మంత్రి శ్రీధర్ బాబు కూడా గాంధీయవాది అని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ కోసం ఖాదీ, గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించారు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కీలక నాయకుడు, సామాజిక కార్యకర్త అని కొనియాడారు. బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరును లేకుండా చేస్తున్నారని ధ్వజం ఎత్తేరు. మన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా సత్యం, అహింసతో నేర్చుకోవాలని అదే బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరికి హింస అనేది లేకుండా శాంతితో కూడుకున్న నైతిక విలువలతో ముందుకెళ్లాలని మా నాయకుడు, రాష్ట్ర మంత్రి మాకు దిశా నిర్దేశం ఎప్పుడు చేస్తూ ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాధుల శ్రీకాంత్, టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరి రాజు, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ జి, మాజీ ఎంపీపీ కొండా శంకర్, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, జిల్లా మీడియా ఇంచార్జీ అరెల్లి కిరణ్, బీసీ సెల్ టౌన్ అధ్యక్షులు బండారి ప్రసాద్, నాయకులు ఎల్లంకి వంశీ, మూల పురుషోత్తం రెడ్డి, సర్పంచ్ ఇసంపెల్లి లక్ష్మీ శ్రీనివాస్, మారుపాక నిహారిక, ఉట్ల అనిల్ రెడ్డి, మబ్బు తిరుపతి, ఎసన్, కొయ్యల దేవేందర్, విజయ్, సురేష్, కుమార్, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు.