31 May, 2026 | 1:06 AM

ఏసీబీ వలలో సైబర్ ఇన్స్‌పెక్టర్

31-05-2026 12:32 AM
  1. లంచం తీసుకుంటుండగా అదుపులోకి
  2. ఇంట్లో సోదాలు, 13 లక్షలు, ఆభరణాలు స్వాధీనం

ముషీరాబాద్, మే 30 (విజయక్రాంతి): సైబర్ మోసం కేసులో పేర్లు చేర్చొద్దంటే తన కు రూ.9 లక్షల ఇవ్వాలని లంచం డిమాండ్ చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ మహేందర్‌ను ఏసీ బీ అధికారులు శనివారం అరెస్టు చేశారు. బాధితుడి నుంచి ఇప్పటికే రూ.5 లక్షలను తీసుకొని మిగతా రూ.4 లక్షల కోసం బెదిరించాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మహేందర్‌ను నాంపల్లిలోని సైబర్ కార్యాలయంలో అరెస్ట్‌చేశారు. సోదాలు నిర్వహించి, రూ.13 లక్షలు, బంగారు ఆభరణాలు, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.