02-07-2025 01:05:53 AM
మణికొండ జూలై 1 : హైడ్రా ఆదేశాలతో చిత్రపురి కాలనీలో హెచ్‌ఎం డిఏ అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన రోహౌసెస్‌లో మంగళవారం ము న్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హెచ్‌ఎండిఏ అనుమతులు లే కుండా చిత్రపురిలో అక్రమంగా రోడ్డు మీద బఫర్ ప్రాంతాల్లో 6 రో హౌస్ లు గత 15 సంవత్సరాల కిందట నిర్మించారు.
దీనిపై చిత్రపురి కాలనీవాసులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో అక్రమ నిర్మాణాలుగా 2023, మే 13వ తేదీన 4 రోహౌసేస్ ను అప్పటి ము న్సిపల్ అధికారులు కూల్చివేశారు. మిగతా రెండు బఫర్ ప్రాంతంలోని అక్రమ రో హౌస్ ల నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని సానికులు మున్సిపల్ అధికారులకు, హైడ్రా అధికారులకు ఫి ర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన హైడ్రా అధికారులు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ రోజు మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగి న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంతోష్ సింగ్ ఒక రోహౌస్ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. మిగతా ఒక రోహౌస్ నిర్మాణాన్ని కూల్చబోయే సమయంలో ఇంటి యజమాని తమకు ఒక రోజు సమయం గడువు ఇవ్వాలని కోరాడు. అధికారులు చిత్రపురి కమిటీ సభ్యుడు అయిన ఆ యజమానికి విజ్ఞప్తి మేరకు ఒకరోజు సమయం ఇచ్చారు.