హాలీవుడ్ స్ఫూర్తితో తీశా.. కాపీ కొట్టలేదు
జీవీ ప్రకాశ్‌కుమార్ ప్రస్తుతం ‘కింగ్‌స్టన్’ చిత్రంతో వస్తున్నారు. ఫస్ట్ సీ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించగా, జీవీ ప్రకాశ్‌కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 7న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో నితిన్ మాట్లాడుతూ.. “కింగ్‌స్టన్’ ట్రైలర్ స్టన్నింగ్‌గా ఉంది. విజువల్స్ ఫెంటాస్టిక్‌గా ఉన్నాయి.
ఇది ఫస్ట్ సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్. విజువల్ వండర్ చిత్రం” అని తెలిపారు. జీవీ ప్రకాశ్ మాట్లాడుతూ.. “కింగ్‌స్టన్’ మూవీ ఒక బిగ్ డ్రీమ్. నిర్మాతగా ఇది నా ఫస్ట్ మూవీ. ‘హ్యారీపోటర్’ లాంటి మల్టీ యూనివర్స్ సినిమాలు చూసినప్పుడు డ్రీమ్‌లోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. అలాంటి సినిమాలను చూసి ఇన్‌స్పైర్ అయ్యి, ఈ మూవీని తీశాను.
కానీ ఏ హాలీవుడ్ మూవీని కాపీ కొట్టలేదు” అని చెప్పుకొచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూస్తుంటే ప్రపంచంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు కదా అన్నంత మైండ్ బ్లోయింగ్‌గా ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ దర్శకులు వెంకీ అట్లూరి, వెంకీ కుడుముల, చిత్రబృందం పాల్గొన్నారు.






