జోహ్రా జబీన్.. పండుగ పాట
05-03-2025 12:00 AM
సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘సికిందర్’. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రంజాన్ సందర్భంగా మార్చి 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌గా ‘జోహ్రా జబీన్’ పాటను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది.
ఈ ఎనర్జీ- ప్యాక్డ్ డ్యాన్స్ నంబర్ ఈద్ వేళ సంగీత ప్రియుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని మేకర్స్ నమ్మకంగా చెప్తున్నారు. ఈ చిత్రం ద్వారా సల్మాన్‌ఖాన్, రష్మిక మందన్న తొలిసారి తెరపై కనిపించనున్నారు. తాజాగా విడుదలైన పాటలో వారి కెమిస్ట్రీ అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు ప్రీతమ్ సంగీతం సమకూర్చగా, సమీర్, డానిష్ శబరి సాహిత్యం అందించారు. నకాశ్ అజీజ్, దేవ్ నేగి ఆలపించారు.






