20-11-2025 12:00:47 AM
కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి
ఆదిలాబాద్, నవంబర్ 19 (విజయ క్రాం తి): ఇందిరాగాంధీ చూపిన స్పూర్తితో రాష్ట్రం లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు సాగుతోందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం మావలలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆమె దేశ ప్రధానిగా చేసి న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటిం చారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యం లో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయూరాలుగా నిలిచిందని అన్నారు. నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి గా ఇందిరాగాంధీ పేదరిక నిర్ములన, బ్యాంకుల జాతీయకరణ వంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలను తీసుకోవడం జరిగింద న్నారు.
మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఏ విధంగా తమ తమ రంగాల్లో వృత్తి, వ్యవహారపరంగా ఎలా ఉండాలనేదానికి ఇందిరా గాంధీ ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మావల మండల్ అధ్యక్షులు చంద్రశేఖర్, ఎన్‌ఎస్‌యూఐ మండల్ అధ్యక్షులు మరసుకోలా గౌతమ్, వర్కింగ్ ప్రెసి డెంట్ సురేష్, అలీమ్, రహీమ్ ఖాన్, రాజ న్న, ప్రభాకర్, రహీమ్ ఖాన్ పాల్గొన్నారు.