20-11-2025 01:04:07 AM
ఎల్బీనగర్, నవంబర్ 19(విజయక్రాంతి): పాపం పండింది... ప్రజలకు ఉపయోగపడే పార్కును అక్రమార్కులకు అక్రమంగా కట్టపెట్టినందుకు ఇన్ చార్జి సబ్ రిజిస్ట్రార్ పై అధికారులు వేటు వేశారు. సబ్ రిజిస్ట్రార్ల అక్రమాలు, కాసుల కక్కుర్తి కలకలం రేపుతున్నాయి. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యా లయంలో మూడు నెలల వ్యవధిలోనే అక్రమాలతో ఇద్దరిపై వేటు పడింది. ఆగస్టులో సబ్ రిజిస్ట్రార్ ఎస్.రాజేష్ కుమార్ ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పట్టుకోగా..
ఇప్పుడు కాసుల కక్కుర్తితో పార్కు స్థలం ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినందుకు వనస్థలిపురం ఇన్ చార్జి సబ్ రిజిస్ట్రార్ శివశంకర్ ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంగళవారం సస్పెండ్ చేసింది. ఒక పార్కు స్థలానికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో వేటు వేసింది. గత సబ్ రిజిస్ట్రార్ రాజేష్ రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో ఈ స్థానం ఖాళీ అయిం ది. దీంతో సీనియర్ అసిస్టెంట్ శివశంకరు సబ్ రిజిస్ట్రార్ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు.
బాధ్యతలు స్వీకరించిన రోజుల వ్యవధిలోనే హయత్ నగర్ మండలం సాహెబ్ నగర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని 200 సర్వే నంబర్ లో జీహెచ్‌ఎంసీ పార్కు స్థలం వివాదంలో ఉంది. ఈ ప్రాంతంలో గతంలో గ్రామ పంచాయతీ లేఅవుట్ (అనధికారిక) ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతు న్నాయి. పలువురు కోర్టులను ఆశ్రయించి పర్మిషన్లు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.
ఇదే క్రమం లోనే పార్కు ఉన్న స్థలానికి కూడా బై నెంబర్ కొందరు రిజిస్ట్రేషన్లకు దరఖాస్తు చేసుకోగా సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్సెస్పెక్టర్ జన రల్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు. చేశారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు పార్కు స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో విచారణ చేయించగా.. పలు డాక్యుమెంట్లకు ఒకే ప్రాంతం ఫొటోలు చూపించినా.. రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం, పార్కు స్థలం ఉన్నట్లు స్థానికులు ఫిర్యాదు చేసినా.. సబ్ రిజిస్ట్రార్ ఉదాసీనంగా వ్యవహరించినట్లు అధికారుల విచారణలో గుర్తించడంతో సస్పెండ్ చేశా రు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల అవినీతి నిరోధక శాఖ దాడుల నేపథ్యంలో కార్యాలయాల్లో ఉన్న లోపాలపై ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ శ్రీపురం కాలనీలో చత్రపతి పార్కును కబ్జాకు పాల్పడ్డారని కాలనీ వాసులు ఆరోపించారు. శ్రీపురం కాలనీ విని యోగంలో ఉన్న చత్రపతి శివాజీ పార్కును అక్రమంగా కొందరు వ్యక్తులు రిజస్ట్రేషన్ చేసుకున్నారని, వాటికి ఎస్‌ఆర్ ఎస్ పూర్తి స్దాయిలో జీహెచ్‌ఎంసీకి చెల్లించారు.
సాహె బ్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 200లో 1967లో కాలనీ లేఅవుట్ ఏర్పడింది. లేఅవుట్లో అప్పట్లో సుమారు 5 వేల గజాల స్థలాన్ని పార్కు కోసం, గణేశ్ మండపం, క్రీడా ప్రాంగణం కోసం వదిలి పెట్టారు. అందులో భాగంగా పార్కు స్థలం లో లక్షల వ్యయంతో పార్కును అభివృద్ధి చేశారు. పార్కులో కాలనీ వాసులు నిత్యం వాకింగ్ చేస్తుంటారు. ఆరు నెలల క్రితం ఫుట్ పాత్, జిమ్, ప్రహరీ, ఫెన్సింగ్ కోసం సుమారుగా రూ, 40 నుంచి రూ, 50 లక్షల వ్యయం చేశారని స్థానికులు చెబుతున్నారు.
అయితే , నెల రోజుల కమ్యూనిటీ హల్ కోసం రూ. 30 లక్షలు మంజూరు కావడం తో టెండర్లు జరిగాయని జిహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. కమ్యూనిటీ హల్ 200 గజాలు, చత్రపతి శివాజీ 600 గజాల పార్కు స్థలం, ప్లే గ్రౌండ్, గణేష్ మండపంలో 1000 గజాలు కేటాయించారు 1000 గజాల ఖాళీ స్థలాన్ని కబ్జా చేయాలని కొందరు 2025లో రిజస్ట్రేషన్ చేసుకున్నారని వివిధ కాలనీల అధ్యక్షులు తెలిపారు.
కాలనీ వాసులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి, అక్రమంగా చేసిన రిజస్ట్రేషన్ పత్రాలను రద్దు చేయాలని కోరారు. రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలని, జీహెచ్‌ఎంసీ హయత్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
పార్క్ స్థలం రిజస్ట్రేషన్ రద్దు చేయాలంటూ ఉత్తర్వులు
బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ సిరిపురం కాలనీ చత్రపతి శివాజీ పార్క్ స్థలం అక్రమ రిజస్ట్రేషన్ రద్దు చేయాలని జీహెచ్ ఎంసీ హయత్ నగర్ సర్కిల్ అధికారులు వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఉత్త ర్వులు జారీ చేశారు. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి విచారించగా ఐదు ప్లాట్లకు చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు.