calender_icon.png 20 November, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుచిత పోస్టు చేస్తే కఠిన చర్యలు

20-11-2025 12:02:17 AM

ఎస్పీ జానకి షర్మిల 

నిర్మల్, నవంబర్  (విజయక్రాంతి): సోషల్ మీడియా వేదికలపై ఎవరైనా అనుచిత లేదా గౌరవం దెబ్బతీసే విధంగా వ్యాఖ్య లు చేసినా, అలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా  ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోషల్ మీడియాను వినియోగించే ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా వినియోగించాలి. వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు, మహిళలు, చిన్నారులు, వర్గాలు, ధార్మిక భావాలు, ప్రభుత్వ అధికారులు మొ దలైన వారిపై అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు వార్తలు లేదా అపోహలు పుట్టించే పోస్టులు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు అని అన్నారు.

ఎవరైనా తప్పుడు వార్తలు చేసినా, లేదా ఒకరి ప్రతిష్టకు భంగం కలిగిం చే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా... వారు శిక్షార్హులే అని హెచ్చరించారు. సామాజిక శాంతి భద్రతలు కాపాడటానికి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించా లని ఎస్పీ సూచించారు. ప్రజలు ఏదైనా అనుమానాస్పద పోస్టులు గమనించినప్పు డు వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీ స్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలియజేశారు.