25 May, 2026 | 1:06 AM

గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు

25-05-2026 12:00 AM

మధిర, మే24 (విజయక్రాంతి): మధిర మండలం వివిధ గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫారములు ఏర్పాటు చేసినట్లు రూరల్ సెక్షన్ ఏఈ ఎస్ మైథిలి తెలిపారు. ఆదివారం మండలంలోని  ఇల్లెందులపాడు, ఖమ్మంపాడు, నాగవరపాడు, మాటూరు పేట గ్రామాల్లో ప్రజలకు నూతన విద్యుత్ ట్రాన్స్ఫారం లను ఏర్పాటు చేశామన్నారు.

మధిర మండలంలో వేసవి ఉష్ణోగ్రతలతో చల్లదనం కోసం వినియోగదారులు వినియోగిస్తున్న విద్యుత్తు ఉపకరణాలతో ప్రస్తుతం ఉన్న విద్యుత్తు ట్రాన్స్ ఫారముల పై అధికలోడు ఏర్పడి, లో వోల్టేజ్ సమస్యలు ఏర్పడడంతో వినియోగదా రులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంతో మధిర గ్రామీణ విద్యుత్ శాఖ వారు అధిక సామర్థ్యం కలిగిన  ట్రాన్స్ ఫారములను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని ఇతర గ్రామాలలో కూడా  ఏ ఏ సమయంలో అధికలోడు ఏర్పడుతున్నదో  విద్యుత్ శాఖ సిబ్బందితో పర్యవేక్షించి తక్షణం ఆయా గ్రామాల్లో కూడా నూతన విద్యుత్ ట్రాన్స్ ఫారములు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.