27-10-2025 12:00:00 AM
చిట్యాల, అక్టోబర్ 26(విజయ క్రాంతి): ఆర్గానిక్ శ్రీకృష్ణ మందిరంలో శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామంలోని ఆర్గానిక్ శ్రీకృష్ణ మందిరంలో ఆదివారం శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పండితుల సమక్షంలో వేద మంత్రాలతో, యజ్ఞ హోమాలతో నిర్వహించారు.
శివలింగ ప్రతిష్టాపన చేసి ఆలయ నిర్మాణికులు పామునుగుల్ల యాదయ్య, పామునుగుల్ల వెంకటేశ్వర్లు, వారి బంధుమిత్రుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ప్రాగాణంలో చిన్నారులు, శాస్త్రీయ నృత్య కళాకారులు, కూచిపూడి భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించి ఆ భగవంతుడి పట్ల వారి భక్తిని చాటుకున్నారు.ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాగణంలో తీర్థ అన్న ప్రసాదాలను స్వీకరించారు.