27-10-2025 12:00:00 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ అక్టోబర్26 (విజయక్రాంతి): నిత్య జీవితంలో యోగ ను అలవర్చుకున్నట్లయితే మానసిక ప్రశాంతత ,సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆనందో బ్రహ్మ యోగమండలి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి యోగ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగ చేయడం అలవర్చుకోవాలని ఆయన సూచించారు.
నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, పిఏసియస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, ఏవియం విద్యాసంస్థల అధినేత కందాలపాపిరెడ్డి, నాయకులు నకిరేకంటి ఏసు పాదం, మురారి శెట్టి కృష్ణమూర్తి, యాసారపు వెంకన్న, మట్టిపల్లి వీరు, ఆనందోబ్రహ్మ యోగ మండలి ప్రధాన గురూజీ మిరియాల చల్మరాజు, సంస్థ సీనియర్ సభ్యులు బ్రహ్మదేవర రామ్మూర్తి, జితేందర్ రెడ్డి, నాయకులు,యోగ మండలి సభ్యులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.ఆదివారం నకిరేకల్ మండలంలోని నోముల, వల్లభాపురం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులు ఎవ్వరు ఆందోళన చెందదు ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, నాయకులు నకిరేకంటి ఏసు పాదం , గాదగోని కొండయ్య,యాస కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.