27-10-2025 12:00:00 AM
సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
నకిరేకల్ అక్టోబర్26 (విజయక్రాంతి) : తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవిత కడవరకు మార్క్సిస్టు పార్టీ బాటలో పయనించిన వ్యక్తి పొన్న లింగయ్య అని వారి మృతి సిపిఎం పార్టీకి తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కట్టంగూరు మండలంలోని చెర్వు అన్నారం గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు పోన్నలింగయ్య(85) అనారోగ్యంతో మృతి చెందారు. వారి పార్థివదేహం పైఎర్రజెండాకప్పి,పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొన్న లింగయ్య పార్టీకి చేసిన సేవలను గుర్తు చేశారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చిన జీవిత కడవరకు సిపిఎం పార్టీని అంటూ పెట్టుకుని పనిచేశారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతగానో కృషి చేశారని ఆయన తెలిపారు. ప్రజా పోరాటాలు ఉద్యమాలు ఎక్కడ నిర్వహించిన ముందు వరుసలో నిలిచే వారిని ఆయన పేర్కొన్నారు. తనకు పుట్టిన కుమారులను కుడా పార్టీకి సేవ చేసే విధంగా ప్రోత్సహించి ముందుకు నడిపిన వ్యక్తి అన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.
అప్పుడే మనము ఆయనకిచ్చే ఘనమైన నివాళులు అని తెలిపారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పెంజర్లసైదులు, పార్టీ మండల నాయకులు, చిలుముల హేమంతయ్య, ఇటుకల సురేందర్, జాలా రమేష్, గడగోజు రవీంద్రాచారి, చిలుముల రామస్వామి,కక్కిరేణిరాస్వామి, పొన్నఅంజయ్య,ముస్కు రవీందర్, పోన్న శాంతి కుమార్, రెడ్డిమల్ల బిక్షం, గద్దపాటి సుధాకర్, గంట వెంకన్న, నంద్యాల రాంరెడ్డి, కృష్ణయ్య,గద్దపాటిదశరథ, మల్లేష్, బీరప్ప, నరసింహ, నగేష్ సత్యం,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.