calender_icon.png 21 January, 2026 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికే ఆదర్శం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు

21-01-2026 01:53:06 AM

సన్న బియ్యంతో పేదల ముఖాల్లో వెలుగులు 

మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్/గరిడేపల్లి, జనవరి 20 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రపంచంలోనే ఆదర్శవంతమైన విద్యా సంస్థలుగా నిలుస్తాయని భారీ నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడే పల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులు ఆదేశించారు.   పాఠశాల నిర్మాణం లో భాగంగా 20 కోట్లతో మం జూరు చేసిన బిటి డబుల్ రోడ్డు ను వచ్చే వేసవికాలం వరకు పూర్తి చేయాల్సిందిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్య మౌలిక సదుపాయాల సంస్థ ఎండి గణపతి రెడ్డిని కోరారు. 

మహిళా సంఘాలకు రుణాలు

పేదలకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీతో వారి ముఖాలలో వెలుగులు నిండుకు న్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, మఠం పల్లి, గరిడేపల్లి, హుజూర్‌నగర్ మండలాల్లో పర్యటించారు. హుజూర్‌నగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలలో హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 365 స్వయం సహాయక సంఘాలకు 1,36,62, 586 రూపాయల చెక్కులను అందజేసి మా ట్లాడారు. రాష్ర్టంలో 13,500 కోట్ల రూపాయల వ్యయంతో 3.17 కోట్ల మందికి ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్నబియ్యాన్ని ఇస్తున్నామన్నారు. హుజూర్ నగర్ లో రూ.123 కోట్ల రూపాయలతో వ్యవసాయ కళాశాల మంజూరు అయి దని ఈ నెల 23న రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్‌శర్మతో శంకుస్థాపనకు చర్యలు తీసుకుంటు న్నట్లు తెలిపారు.

మహిళా సంక్షేమంలో భాగం గా ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం జరిగిందని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తీస్తున్నామని, సన్న బియ్యం, నూతన రేషన్ కార్డ్,విద్య, వైద్యం, రహదారులను ఏర్పాటు చేశామని, నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించి 4500 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, రూ.28 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించానని తెలిపారు. దివ్యాంగులు ట్రై సైకిల్స్, మోటర్ స్కూటీలు, లాప్ టాప్ లను ఇస్తున్నామన్నారు. రామస్వామి గుట్ట దగ్గర ఉన్న 2160 సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇండ్లు లేని నిరుపేదలకు అందిస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రాష్ర్ట వికలాంగుల సంస్థ కార్పోరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్లు రాధిక అరుణ్ కుమా ర్, బెల్లంకొండ విజయలక్ష్మి పాల్గొన్నారు.