calender_icon.png 28 November, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో విడత పోరుకు ముమ్మర కసరత్తు

28-11-2025 01:14:37 AM

  1. టేకులపల్లి మండలంలో కాంగ్రెస్ ఓ అడుగు ముంకు..

గ్రామాలలో సమావేశాలు నిర్వహిస్తున్న నాయకులు 

టేకులపల్లి, నవంబర్ 27, (విజయక్రాంతి): ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాలతో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ టేకులపల్లి మండలంలోని గ్రామ పంచాయతీలలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. మొక్కంపాడు, రామచంద్రునిపేట, బోడు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాలలో గెలిపించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. అభ్యర్థులను గ్రామ ప్రజల, స్థానిక కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఎంపిక చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందడుగులు వేస్తుందని, ఇందిరమ్మ ఇళ్ళు,ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇలా మారన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందని ప్రజలకు తెలపాలన్నారు.

దొరల అహంకార పాలన నుండి విముక్తి చెంది ప్రజా పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న రేవంత్ రెడ్డి పాలనకు అందరూ అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.