calender_icon.png 28 November, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి

28-11-2025 01:17:01 AM

కరీంనగర్, నవంబరు 27 (విజయ క్రాంతి): జిల్లాలోని మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షలను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం నగరంలోని టీఎన్జీవో భవనంలో ఎన్జీవోల సంఘం, జిల్లా వైద్యారోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హాజరై ఆరోగ్య పరీక్షలను పరిశీలించి మాట్లాడారు.

జిల్లాలోని ప్రతి మహిళ ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని అన్నారు. సుమారు 50 వేల రూపాయలు విలువచేసే 45 రకాల పరీక్షలు ప్రతి ఆరోగ్య కేంద్రంలో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేస్తారని తెలిపారు. ప్రత్యేక క్యాంపుల ద్వారా కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటరమణ, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సనా, ఉమాశ్రీ, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సంగేం లక్షణ్ రావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా సహాధ్యక్షులు ఒంటెల రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, మహిళా జేఏసీ నాయకులు ఇరుమల్ల శారద, సునీత, సరిత, విజయలక్ష్మి, లలితమేరీ, రమణ, స్వరూపా, లక్ష్మీ, బాగ్యలక్శి, ఉర్మీళ, అస్గర్ అలీ, గోవిందాపతి శ్రీనివాస్, వాస్తవి గౌడ్, కోమ్మెర శ్రీనివాస్ రెడ్డి, లవ కుమార్, శ్రీనివాస్, తదితరులుపాల్గొన్నారు.