calender_icon.png 4 February, 2026 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జానో జాగో సంఘం జిల్లా అధ్యక్షుడిగా యూసుఫ్

04-02-2026 12:18:30 AM

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ రహీం

సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 3: జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక) సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా మొహమ్మద్ యూసూఫ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ అబ్దుల్ రహీం నియమితులయ్యారు. ఈ మేరకు జానో జాగో సంఘం జాతీయ అధ్యక్షుడు సయ్యద్ నిసార్ అహ్మద్, జాతీయ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా తంజీలూర్ రహమాన్ నోమానీ చేతుల మీదగా నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా సయ్యద్ నిసార్ అహ్మద్, మొహమ్మద్ హుస్సేన్, మౌలానా తంజీలూర్ రహమాన్ నో మానీ మాట్లాడుతూ, మత రాజకీయాలు మాకొద్దు, అభివృద్ధి ఫలాలు మాకు కావాలి అన్న ని నాదంతో ముస్లింల రాజకీయ, ఆర్థిక, సామాజిక పురోగతికి ప్రతి ఒక్క జానో జాగో సంఘం నే త, కార్యకర్త పనిచేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి ముస్లింను చైతన్యం చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర మైనార్టీ వర్గాలతో కలసి బడుగు రాజ్యాధికారం సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జానో జాగో సంఘం నేతలు మొహమ్మద్ ఖాసీ, మొహమ్మద్ సుభాన్ అలీ, ఇతర నేతలు పాల్గొన్నారు.