calender_icon.png 23 August, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

23-04-2025 09:59:17 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుందని స్థానిక ఎస్సై సురేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన పందిరి అశ్విత(17) అనే ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకొని మృతి చెందిందన్నారు. మృతురాలు పట్టణంలోని వాగేశ్వరి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోందన్నారు. నిన్న విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో మృతురాలు ఇంగ్లీషు ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయినందున మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి పందిరి భూమయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.