23-04-2025 09:58:31 PM
టిజి ఎన్పీడీసీఎల్ చైర్మన్ వరుణ్ రెడ్డి..
కామారెడ్డి (విజయక్రాంతి): విద్యుత్ లైన్లలో సమస్యల పరిష్కారానికి ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్స్, ఏబి స్విచ్లు ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూస్తామని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిరిసిల్ల రోడ్డు వద్ద 33/11 కెవి సబ్ స్టేషన్, పవర్ హౌస్ కాంపౌండ్ ను ఆయన సందర్శించారు. సబ్ స్టేషన్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించడంలో ఎలాంటి అంతరాయాలు కలవకుండా మేరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సబ్ స్టేషన్ లో సాంకేతికను మరింత అభివృద్ధి చేయడం ద్వారా వినియోగదారులకు అంతరాయాలు తగ్గించడానికి పలు సూచనలు చేశారు. విద్యుత్ సేవలో నూతన సాంకేతిక పరిజ్ఞాన్ని అమలు చేస్తూ వినియోధాలకు వేగవంతం సేవలందించేందుకు ముందడుగు వేశామన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఇంజనీర్లు, అకౌంట్స్, సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ... విద్యుత్ లైన్లలో సమస్యల పరిష్కారానికి ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్స్, ఏబి స్విచ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల సమస్యలు తలెత్తిన వెంటనే లొకేషన్ గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారాన్ని పంపించి త్వరితగతిగా సమస్యలు పరిష్కరించవచ్చన్నారు.
రానున్న రోజుల్లో విద్యుత్ శాఖలో సాంకేతిక కదలిక సేవలు మరింతగా విస్తరించి వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తామని సిబ్బంది కొరక కూడా తీర్చబడుతుందని స్పష్టం చేశారు. డీడీలు చెల్లించిన రైతులకు విద్యుత్ కనెక్షన్లు వేయంగా మంజూరు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, డైరెక్టర్ (కమర్షియల్) సదర్ లాల్, చీఫ్ ఇంజనీర్ అశోక్, కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఇంజనీర్ శ్రావణ్ కుమార్ తదితర ఉన్నత అధికారులు ఎస్ఈ, డిఈ, ఏడీఈ, ఏఈ అకౌంట్ సిబ్బంది, సబ్స్టేషన్ ఆపరేటర్లు పాల్గొన్నారు.