23-04-2025 10:10:24 PM
పాల్వంచ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రివర్యులు వనమా..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): వరంగల్ బహిరంగసభ కనీవిని ఎరుగని రీతిలో జరుగుతుందని, ఈనెల 27న తెలంగాణ రాష్ట్రం గులాబీ మయంతో ఒక పండగ వాతావరణం ఏర్పడుతుందని రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు(Former Minister Vanama Venkateswara Rao) అన్నారు. బుధవారం పాత పాల్వంచలోని తన స్వగృహంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలన ఒక స్వర్ణ యుగమని కేసిఆర్ ఒక కారణజన్ముడని కొనియాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలాగా వరంగల్ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 420 హామీలు ఆరు గ్యారెంటీల మాయమాటలతో ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ దను విమర్శించారు. ప్రతి కార్యకర్త భారీగా జనాన్ని సమీకరించాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేందర్ రావు, సీనియర్ జిల్లా నాయకులు కిలారు నాగేశ్వరరావు, పాల్వంచ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనికేష్,మాజీ ఎంపీపీ మడివి సరస్వతి, జిల్లా బిఆర్ఎస్ నాయకులు దాసరి నాగేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు.