3 May, 2026 | 1:47 AM

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

03-05-2026 12:34 AM

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫరీక్ష ఫీజు గడువును ఈ నెల 4 వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు శనివారం ప్రకటనను విడుదల చేసింది. విద్యార్థులు ఈ నెల 4వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. రూ.3 వేల ఆలస్య రుసుముతో ఈ అవకాశాన్ని కల్పించారు. మే 13 నుంచి 21 వరకు పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.