బావిలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు
బచ్చన్నపేట, మే 2 (విజయక్రాంతి): సరదా కోసం బావిలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతైన ఘటన బచ్చన్నపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం బచ్చన్నపేట మండలానికి చెందిన ఏనుగుల బిక్షపతి -పద్మ దంపతుల చిన్న కుమారుడైన ప్రశాంత్ (27) సిద్దిపేటకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న రాజన్న బావిలో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతున్న క్రమంలో పైనుంచి దూకాడు.
దూకిన కొద్దిసేపటి వరకు ప్రశాంత్ కనిపించకపోవడంతో స్థానిక పోలీసులకు అక్కడ ఈత కొట్టడానికి వచ్చిన గ్రామస్తులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్ చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది గజ ఈతగాళ్లను తీసుకొచ్చి బావిలో నాలుగు గంటలపాటు గాలించినా ప్రశాంత్ ఆచూకీ దొరకడం లేదని తెలిపారు. ప్రశాంత్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగి స్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






