9 July, 2026 | 1:29 AM

సఖి ఫౌండేషన్ పేరుతో మహిళలకు మోసం

09-07-2026 12:36 AM
  1. లక్షలు దండుకున్న నరాల సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలి
  2. 15 రోజుల్లో డబ్బులు తిరిగి ఇవ్వకుంటే ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు  చేస్తాం
  3. బాధితుల డిమాండ్

ముషీరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): సఖి ఫౌండేషన్, టీఆర్‌ఎస్(డి) పేర్లతో అమాయక మహిళలను మోసం చేస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్న తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అధ్యక్షుడు నరాల సత్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాధితులు తెలంగాణ రక్షణ సమితి (డి)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్‌గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచర్ల మంజుష, పట్నాల సావి త్రి, కూనం సీత మాట్లాడారు.

సభ్యత్వాలు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూ లు చేశారని ఆరోపించారు. అలాగే పార్టీలో వివిధ పదవులు ఇప్పిస్తానంటూ వందలాది మంది నుంచి డబ్బులు దండుకున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల పేరు తో ఒక ఉద్యమ వేదికను ఏర్పాటు చేసుకుని మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

వేలాది మంది నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ, ఇకపై ఎవరూ ఆయన మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని బాధితులు డిమాండ్ చేశారు. 15 రోజుల్లో నరాల సత్యనారాయణ తీసుకున్న డబ్బులు చెల్లించకుంటే ఎస్సీ,  ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని హెచ్చ రించారు. ఈ సమావేశంలో బాధితులు ఆనంద్ బాబు, శ్రీనివాస్,  సరస్వతి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.