16 April, 2026 | 6:11 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా ప్రజా ప్రభుత్వ పాలన

04-06-2025 12:47 AM

సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి 

మహబూబాబాద్, జూన్ 3 (విజయ క్రాంతి): అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి అన్నారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయించిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఎంపీలు రవిచంద్ర, పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు, కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, వద్దిరాజు కిషన్, అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.