28 March, 2026 | 3:18 AM

ఘనంగా అంతర్జాతీయ బౌద్ధ సదస్సు

28-03-2026 01:29 AM
  1. 22 దేశాల నుంచి 80 మంది ప్రతినిధుల హాజరు

యుద్ధ మేఘాల వేళ బుద్ధుని బోధనలే మార్గదర్శకం: శ్రీలంక మంత్రి సునీల్ సెనేవి 

బుద్ధవనాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి 

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27 (విజయక్రాంతి): ప్రపంచ దేశాలను యుద్ధ వాతావరణం కలవరపెడుతున్న తరుణం లో అశాంతి రక్కసిని పారద్రోలి విశ్వ శాంతి ని స్థాపించడానికి బౌద్ధమే ఏకైక శరణ్యమని శ్రీలంక బుద్ధశాసన, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆచార్య హినీదుమె సునీల్ సెనేవి ఉద్ఘాటించారు. బుద్ధవనం ప్రాజెక్టు, వియత్నాం బౌద్ధ సంఘం సం యుక్త ఆధ్వర్యంలో బేగంపేట్‌లోని ది ప్లాజా హోటల్లో ప్రపంచ శాంతి అంశంపై శుక్రవా రం అంతర్జాతీయ బౌద్ధ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన ప్రసంగిస్తూ..

బుద్ధుని బోధనలను ఆచరించడం ద్వారానే ప్రపంచంలో శాంతియుత వాతావరణం నెలకొంటుందని స్పష్టంచేశారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య స్వాగతోపన్యాసంతో ఈ సదస్సు లాంఛనంగా ప్రారంభమైంది. సదస్సులో మంత్రి జూపల్లి, వియత్నాం బౌద్ధ సంఘం అధ్యక్షులు పూజ్యనీయ తీచ్ నాత్ తు, నవ నలంద మహా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య సిద్ధార్థ సింగ్, 22 దేశాల నుంచి దాదాపు 80 మంది పాల్గొన్నారు.