27 August, 2026 | 12:46 PM

ఆరోగ్య ప్రదాత యోగా: కోట్ల మందిని అనుసంధానిస్తున్న శక్తి - ప్రధాని మోదీ

22-06-2026 01:46 AM

గొప్ప సామూహిక శక్తి

ప్రధాని నరేంద్ర మోదీ

కోల్‌కతాలో అంతర్జాతీయ యోగా వేడుకలు

2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. యోగా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, రోగనిరోధక శక్తిని పెంచే ప్రపంచవ్యాప్త ఆరోగ్య ఉద్యమంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది థీమ్ "ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా".

కోల్‌కతా, జూన్ 21: యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అనుసంధానించే ఒక గొప్ప సామూహిక శక్తిగా ఎదిగిందని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా శారీరక చలనశీలత, మానసిక ప్రశాంతత, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంలో యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. జాతి, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రపంచంలోని ప్రతిఒక్కరినీ కలిపే అద్భుతమైన శక్తి యోగాకు ఉందని మోదీ తెలిపారు.

తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యమైన పరిణామాల కోసం తాజా వార్తలు చదవండి.

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆదివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌తాలోని చారిత్రక ‘రెడ్ రోడ్’లో ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై, వేలాది మంది ప్రతినిధులు, సాధారణ ప్రజలతో కలిసి సామూహిక యోగాసనాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేశ ప్రజలకు మోదీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ అనే ప్రత్యేక నినాదంతో (థీమ్) నిర్వహించారు. రెడ్ రోడ్‌లో దాదాపు 35 వేల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ రోడ్‌పై ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక నుంచి మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం నేడు కేవలం ఒక రోజు వేడుకగా కాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక పండుగగా రూపొందిందన్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.

భౌగోళిక సరిహద్దులను చెరిపేస్తూ యోగా ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమంగా ఎదిగిందన్నారు. యోగా అనేది కేవలం కొన్ని శారీరక వ్యాయామాల కలయిక మాత్రమే కాదని అన్నారు. అది మానవ ఆత్మ అత్యున్నత అభివ్యక్తి అని పేర్కొన్నారు. మారుతున్న జీవనశైలిలో వయసు పైబడిన వారు శారీరకంగా, మానసికంగా, దృఢంగా ఉండటానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

భారతదేశం సంస్కృతిలో భాగమైన యోగాను నేడు ప్రపంచ వ్యాప్తంగా వాడుకలోకి తీసుకురావడం మనందరికీ గర్వకారణమన్నారు. 20 ఏళ్ల కంటే 40 ఏళ్ల వయసులో మరింత దృఢంగా ఉండాలి. ఒత్తిడి రహిత జీవితానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. మరింత మెరుగైన ప్రపంచం కోసం యోగా ఎంతో అవసరమన్నారు. కాగా కోల్‌కతాలో వేర్వేరు చోట్ల 10 లక్షల మంది యోగాసనాలు వేసేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.    

FAQ's

Q1. యోగా వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందా?
అవును. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శరీర రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

Q2. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు.

Q3. యోగా మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది?
ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచి, ప్రశాంతమైన మనస్సును కల్పిస్తుంది.

Q4. వృద్ధులకు యోగా ఎందుకు అవసరం?
శరీర చలనశీలత, సమతుల్యత, కండరాల బలం పెరగడంతో పాటు ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడుతుంది.

Q5. యోగా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రాచుర్యం పొందింది?
సహజమైన ఆరోగ్య సాధనంగా, మందులు లేకుండా జీవన నాణ్యతను మెరుగుపరచే విధానంగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది.

Q6. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ ఏమిటి?
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని "ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా" అనే థీమ్‌తో నిర్వహించారు.

Q7. యోగా వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
యోగా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణ, రోగనిరోధక శక్తి పెంపు, చలనశీలత మెరుగుదలకు ఉపయోగపడుతుంది.

Q8. కోల్‌కతా యోగా కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు?
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వేలాది మంది ప్రజలు, యోగా సాధకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Q9. యోగా ఎందుకు ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారింది?
మతం, జాతి, ప్రాంతాలకు అతీతంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచే సాధనంగా యోగాను ప్రపంచ దేశాలు స్వీకరించాయి.

Q10. యోగా ఏ వయసు వారికి ఉపయోగపడుతుంది?
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ యోగా ఉపయోగపడుతుంది.

జాతీయ రాజకీయాలకు సంబంధించిన మరిన్ని తాజా వార్తల కోసం మా National News కేటగిరీని చదవండి.