ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సం
ముషీరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్లో ప్రధాన సంరక్షకులు ఎం.వేద కుమార్ నాయకత్వంలో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. డైరెక్టర్ ప్రార్థనా మణికొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు రాంబాబు పాల్గొని విద్యార్థులకు యోగా, ప్రాణాయామం ప్రాముఖ్యతను వివరించారు. సమాజ సేవలో విశేష కృషికి గుర్తింపుగా ఆయనకు లభించిన ’యోగ ప్రజ్వల’ బిరుదును ఈ సందర్భంగా ప్రస్తావించారు.
యోగ సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందుతాయని రాంబాబు పేర్కొన్నారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని డైరెక్టర్ ప్రార్థనా మణికొండ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కట్టా ప్రభాకర్, డీన్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






