25-09-2025 04:56:01 PM
నకిరేకల్,(విజయక్రాంతి): కట్టంగూరు మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ రెండు వైపులా పూర్తిగా ధ్వంసం అయింది. గేటు దిమ్మె కూడా కూలే పరిస్థితిలో ఉంది. దీంతో పాఠశాలకు రక్షణ లేకుండా పోయింది. దీంతో పాఠశాలలోకి బర్రెలు,కుక్కలు ఇతర జంతువులు వెళ్తున్నాయి. పాఠశాల గ్రౌండ్, మొక్కలు చెడిపోతున్న పరిస్థితి ఉంది.
పాఠశాలకు సెలవులు వచ్చిన సమయంలో కొంతమంది యువత చెడు వ్యసనాలకు బానిసలై పాఠశాలలో మద్యం, కూల్ డ్రింక్స్, సిగరెట్లు సేవిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాఠశాల పున ప్రారంభం కాగానే మందు సీసాలు, సిగరెట్ డబ్బాలు, కూల్ డ్రింక్స్ బాటిల్స్ దర్శనం ఇస్తున్నాయి. దీంతో విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకుగురవుతున్నారు.ప్రభుత్వం, పాలకులు, అధికారుల స్పందించి వెంటనే పాఠశాల ప్రహరీ గోడకు నిధులు వెచ్చించి నిర్మించాలని ప్రజలు విద్యార్థులు కోరుతున్నారు..