calender_icon.png 27 July, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్రాష్ట్ర బైకు దొంగల ముఠా అరెస్టు..

26-07-2025 12:33:31 AM

--20 బైకులు, 7 సెల్‌ఫోన్లు, బంగారం స్వాధీనం 

--దొంగల వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

హాలియా, జూలై 25, ( విజయ క్రాంతి ): జిల్లాతో పాటు, ఇతర ప్రాంతాల్లో బైక్ లను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను హాలియా పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా హాలియా పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పట్టుబడిన బైక్ దొంగలు వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మంచికల్లు గ్రామానికి చెందిన దేవన బోయిన శ్రీను, వేముల నాగరాజు అనే వ్యక్తులు కలిసి నల్గొండ జిల్లాలోని హాలియా మిర్యాలగూడ పట్టణం ఆంధ్ర ప్రాంతంలోని మాచర్ల గుంటూరు రెంటచింతల కారంపూడి ప్రాంతాల్లో పార్కు చేసిన బైక్లను లక్ష్యంగా చేసుకొని వాటికి నకిలీ తాళం చెవిలో తయారుచేసి చోరీ చేస్తున్నారు. వీరిలో దేవనబోయిన శ్రీను పై గతంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో  6 బైకుల దొంగతనం కేసు నమోదు అయ్యాయి.

అనుముల మండలం, అలీ నగర్ కు చెందిన మహ్మద్ జానీ అనే వ్యక్తి  హాలియా, నిడమనూరు, హైదరాబాదులోని  ప్రాంతాల్లో ఆర్టిసి బస్టాండ్ లో పార్క్ చేసిన బైక్లను లక్ష్యంగా చేసుకొని వాటికి నకిలీ తలన సృష్టించి దొంగతనాలను చేసేవాడు. ఈనెల 19న హాలియా బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి పార్క్ చేసిన బైకు చోరీ గురి కావడంతో అదే రోజు హాలియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ జరపగా ఈ నెల 24న అనుముల మండలం అలీ నగర్ చెక్పోస్ట్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా బైక్ చోరీల విషయం ఒప్పుకున్నాడు. త్రిపురారం పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో మరో బైక్ చోరీ ముఠాను త్రిపురారం పోలీసులు అరెస్ట్ చేశారు. అడవిదేవులపల్లి మండలం బాలెంపల్లి గ్రామానికి చెందిన రమావత్ వంశీ, కుర్ర తుల్చ,  కొల్లపూడి వంశీ,  దామరచర్ల మండలం నర్సాపూర్ కు చెందిన ధీరావత్ వంశీ, మునోత్ కిరణ్, హైదరాబాద్ తుర్కయంజాల్ కు చెందిన  కనపర్తి ప్రవీణ్ అనే వ్యక్తులు కలిసి నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో, ఆంధ్ర ప్రాంతంలోని గుడివాడ, గురజాల బైకు దొంగతనాలు, ఎర్రగుంటపాలెంలో బంగారు గొలుసు స్నాచింగ్ చేశారు.

త్రిపురాల మండలంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల బైక్ చోరీలు జరుగుతుండగా శుక్రవారం మండల పరిధిలోని బాబు సాయి పేట ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వివిధ ప్రాంతాలు చేసిన చోరీ వివరాలను పోలీసు ముందు ఒప్పుకున్నారు.  దీంతో వారి వద్ద నుంచి సుమారు 11.80 లక్షల విలువగల సొత్తును రికవరీ చేశారు. మొత్తం 9 మంది నుంచి  పలు కేసుల్లో 20 బైకులు, సెల్ఫోన్లు, 2 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దీంతో దేవన బోయిన శ్రీను వేముల నాగరాజు , మహమ్మద్ జానీలను శుక్రవారం అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్ కు పంపారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో దొంగతనాలు జరగకుండా కట్టినిగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. బైక్ దొంగలను పట్టు కోవడానికి కృషి చేసిన పలువురు పోలీస్ సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా రివార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సీఐ, ఎస్‌ఐ లు , సిబ్బందిని అభినందించారు. సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, హాలియా సీఐ దేవి రెడ్డి సతీష్ రెడ్డి, హాలియా, త్రిపురారం ఎస్‌ఐలు బండి సాయి ప్రశాంత్, నరేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.