27-07-2025 01:03:09 AM
మా పార్టీ ఉంటే వాళ్ల ఆటలు సాగవు!
మేడ్చల్, జూలై 26 (విజయక్రాంతి): ప్రధానమంత్రి మోదీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబునా యుడు, రేవంత్‌రెడ్డి కలిసి కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అని బీఆర్‌ఎస్‌పై కుట్ర పన్నారని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఉంటే తమ ఆటలు సాగవనే ఉద్దేశంతో సదరు నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు.
మోదీ జుట్టు తన చేతిలో ఉందని, రేవంత్‌రెడ్డి తాను చెప్పినట్టు వింటాడని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. శనివారం ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌వీ రాష్ట్రస్థాయి సదస్సుకు కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సముద్రంలో కలిసే మూడు వేల టీఎంసీల గోదావ రి మిగులు జలాల్లో 950 టీఎంసీలను దా మాషా ప్రకారం తెలంగాణకు కేటాయించాక ఏపీలో ఏ ప్రాజెక్టు కట్టుకున్న తమకు అభ్యంతరం లేదన్నారు.
బనకచర్ల ద్వారా గోదావరి జలాలు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే పోరాటం చేశామన్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రాజెక్టు కడుతామంటే ఎలా అని ప్రశ్నించారు. పోస్ట్ కార్డు, ఆన్‌లైన్ పిటిషన్ ద్వారా మన డిమాండ్ తెలియచేద్దామని పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయని, తాము కూడా ట్యాపింగ్ చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారని గుర్తుచేశారు.
అధికారులు ట్యాపింగ్ చేస్తే చే యొచ్చని రేవంత్‌రెడ్డి అన్నారని చెప్పారు. రేవంత్ ప్రభుత్వంలో ట్యాపింగ్ చేస్తే అధికారుల తప్పు.. కేసీఆర్ ప్రభుత్వంలో ట్యాపింగ్ చేస్తే కేసీఆర్, కేటీఆర్‌లది తప్పా? అని ప్రశ్నించారు. పోలీసులు బీఆర్‌ఎస్ నాయకులు, కా ర్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్తితో సహ చెల్లిస్తామని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డికి అధికారులు బానిసలా ప నిచేస్తున్నారన్నారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను పోలీస్ స్టేషన్లో ఉంచి, ఫోన్ కోసం ఆయన భా ర్యను వేధించడమే గాక, హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు. నల్లబాలు రీట్వీట్ చేసినందుకు 20 రోజులు జైలుకు పంపించారని, రాహుల్ గాంధీ చెప్పే మొహబ్బత్ కా దుఖాన్ ఇదేనా అని నిలదీశారు. మూసీలో లక్షన్నరకోట్ల కుంభకోణం జరిగితే బయటపెట్టామని, మన పోరాటం వల్లే ఆగిందని ఆయన పేర్కొన్నారు.
కంచ గచ్చిబౌలి భూములపై పోరా టం చేసింది విద్యార్థులేనని, విద్యార్థుల పోరాటానికి ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. పోరా టాలకు లీగల్ సెల్ అండగా నిలిచిందని అన్నారు. పోరాడిన వారికే రాజకీయంగా పదవులు వస్తాయన్నారు. లీగల్ సెల్ ద్వారా జిల్లాల వారీగా విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కాంగ్రెస్‌కు ఊడిగం చేస్తోందని, సోషల్ మీడియా ద్వారా ఎదుర్కోవాలన్నారు.
వర్సిటీలు ఉద్యమ వేదికలు అవుతాయి: మాజీమంత్రి హరీశ్‌రావు
కాంగ్రెస్ పాలనలో ఆంధ్రాకు నీళ్లు, ఢిల్లీకి నిధులు వెళ్తున్నాయని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గోదావరి జలాలు ఆంధ్రాకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దీనిని బీఆర్‌ఎస్వీ కార్యకర్తలు అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల మీద బీఆర్‌ఎస్వీ కార్యకర్తలకు హరీశ్‌రావు బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు లేఖలు..
‘తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన చేశారు..నికర జ లాల మీద ఆధారపడే ప్రాజెక్ట్లు కడతారు.. తెలంగాణ వాటా ఎంత, ఏపీ వాటా ఎంతో తేలిన తర్వాతనే ఏపీ ప్రాజెక్టులు కట్టాలి..కానీ కేంద్రం తన చేతుల్లో ఉందని బుల్డోజ్ చేసి ప్రాజెక్ట్ నిర్మాణానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారు..’ అని హరీశ్‌రావు ఆరోపించారు. బన కచర్లతో 200 టీఎంసీలు తరలించుకుపోయేందుకు చంద్రబాబు కుట్రపన్నారన్నారు.
వరద జలాలతో కడుతున్నామని చంద్రబాబు అంటున్నారని, నికర జలాలే ఇంకా లెక్క తేలలేదని, ఇక వరద జలాలు ఎక్కడివని ప్రశ్నిం చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 240 టీఎంసీలు నీళ్లు వాడుకునేలా 18రకాల అనుమతులు తీసుకొస్తే, 2018లో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు నిలిపివేయాలని చంద్రబాబు కేం ద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకున్నార ని చెప్పారు.
నిజాం కాలంలోనే ఆర్డీఎస్ ప్రా జెక్టు కట్టారని, కేసీఆర్ ఒక్క సంవత్సరంలోనే తుమ్మిళ్ల ప్రాజెక్టు లిఫ్ట్ పెట్టి పారించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఒక ప్రాజెక్టు కట్టాలంటే బోర్డు, ఆపెక్స్ కౌన్సిల్ ఒప్పుకోవాలని, బనకచర్లకు ఏ అనుమతి లేదన్నారు. ఢిల్లీ తమ చేతిలో ఉందని రాత్రికి రాత్రి డీపీఆర్ పంపి ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారని మండిపడ్డారు.
గోదావరిలో తెలంగాణకు 967 టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు కేటాయించారని, తెలంగాణ చర్చ సందర్భంగా కూడా ఇవి చర్చకు వచ్చాయన్నారు. అయితే తెలంగాణకు 967 టీఎంసీలను కూడా ఏపీ వ్యతిరేకిస్తుంది అని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన లేఖలను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ లెక్క తేలకుండా బనకచర్ల ఎలా కడుతరు?
సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల గోదావరి జలాల్లో తెలంగాణకు 1950 టీఎంసీలు కేటాయించాలని కేసీఆర్ 2020లోనే అప్పటి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖరాశారన్నారు. హైదరాబాద్ నీటి అవసరాలు, పరిశ్రమల కోసం వాటిని వినియోగిం చుకుంటామని లేఖలో పేర్కొన్నారని తెలిపా రు. ఇప్పుడు చంద్రబాబు 200 టీఎంసీలు అడుగుతున్నాడు కానీ 400 టీఎంసీలు వినియోగించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ లెక్క తేలకుండా బనకచర్ల ప్రాజెక్టు ఎలా కడుతావని రేవంత్‌రెడ్డి అడగాలి కదా అని ప్రశ్నించారు. గోదావ రి నీళ్లు లెక్కతేలకుండా రాత్రికి రాత్రి ప్రాజెక్టు కడితే తెలంగాణ ఊరుకోదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. దీనికి రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నా తెలంగాణ సమాజం ఒప్పుకోదని అన్నారు.
నీళ్ల కోసం మరోసారి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుందని.. మరోసారి యూనివర్సిటీలు ఉద్యమ వేదికలు అవుతాయని హెచ్చ రించారు. బనకచర్ల ప్రాజెక్టు కోసం రేవంత్‌రెడ్డి సంతకాలు చేస్తే కేసీఆర్ ఊరుకోడని, రైతులు ఊరుకోరని అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్తామని, రోడ్లను దిగ్బంధం చేస్తామని, అవసర మైతే రైల్ రోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ వాటాలో చుక్కనీటిని వదులుకోమని స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని హరీశ్‌రావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కట్టి కృష్ణా పరివాహక ప్రాంతానికి నీటిని తీసుకెళ్తామని చెప్పారని వివరించారు. 1980లో బచావత్ ట్రిబ్యునల్ 80 టీఎంసీలను కృష్ణా నదికి తరలిస్తే, నాగార్జున సాగర్ మీద ఉన్న 45 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని చెప్పారని అన్నారు.
ఆ 45 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. 157 టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తేనే బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని స్పష్టం చేశారు. 157 టీఎంసీలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి ఎందుకు అడుగడని హరీశ్‌రావు ప్రశ్నించారు. బనకచర్లపై బండి సంజయ్, కిషన్‌రెడ్డి మాట్లాడటం లేదన్నారు.
చంద్రబాబు కుట్రకు రేవంత్ పావు..
ఈ ఏడాది జనవరి 24న సాయంత్రం బనకచర్లపై తాను ప్రెస్ మీట్ పెడితే, రాత్రి 8 గంటలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారని, జూన్ 6న తాను మధ్యాహ్నం పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ పెడితే అదే రాత్రి ఉత్తమ్ లేఖ రాశారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేంద్రమం త్రి కిషన్‌రెడ్డికి లేఖ రాసిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ఇరురా ష్ట్రాల సీఎంల సమావేశానికి వెళ్లనని ముందురోజు చెప్పిన రేవంత్‌రెడ్డి..మరుసటి రోజు వెళ్లి సమావేశానికి హాజరయ్యారని ఎద్దేవా చేశా రు. పోలవరం, బనకచర్లపై సమావేశంలో చర్చించామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెబితే, రేవంత్‌రెడ్డేమో బనకచర్లపై చర్చే జరగలేదని చెప్పాడని విమర్శించారు. ఎజెండా నెంబర్‌వన్‌లో బనకచర్ల లింక్ ప్రాజె క్ట్ అని ఉందని, ఆలిండియా రేడియోలో కూ డా పోలవరం లింక్ ప్రాజెక్ట్ కమిటీ వేశారని చెప్పారని అన్నారు.
బనకచర్లకు జీఆర్‌ఎంబీ, సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, మినిస్ట్రి ఆఫ్ ఎన్విరాన్‌మెం ట్ ఒప్పుకోలేదని, రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా ఆ సమావేశానికి ఎలా వెళ్తాడని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రకు రేవంత్‌రెడ్డి పావుగా మారాడన్నారు. బనకచర్లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ చెప్పిందని, ఢిల్లీకి అఖిలపక్షానికి తీసుకెళ్లాలని కూడా అడిగామన్నారు.
కాళేశ్వరంపై రేవంత్ అబద్ధాలు..
కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి అంటే చెంపచెల్లుమనిపించాలని, కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు గ్యారేజీలు, 15 రిజర్వాయర్లతోపాటు అనేకం అనుబంధంగా ఉన్నాయన్నారు. దీని ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందించామన్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రెండు పిల్లర్లను బాగు చేయాలని ఎన్డీఎస్‌ఏ చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
‘హైదరాబాద్‌కు నీళ్లు తేవడానికి మల్లన్నసాగర్ నుంచి 6 వేల కోట్ల టెండర్లు పిలిచారు.. మేడిగడ్డనే సరిగ్గా లేకపోతే మల్లన్నసాగర్ నుంచి నీళ్లు ఎట్లా తెస్తావు..అంటే రేవంత్‌రెడ్డి చెబుతున్నదంతా అబద్ధమని తేలిపోయింది.. రంగనా యకసాగర్‌కు వచ్చిన మంత్రి కొండా సురేఖ గే ట్లు తెరిచి.. ఒక లక్షా 10 పది వేల ఎకరాలకు సాగునీరు వస్తుందని చెప్పారు..మరి రేవంత్‌రెడ్డి చెప్పింది నిజమా, కొండా సురేఖ చెప్పిం ది నిజమా..పంట పండింది నిజమా.. కాళేశ్వరం కూలింది నిజమా’ అని సీఎం రేవంత్ ను నిలదీశారు.
ఎగువ గోదావరిలో మంచి వర్షాలు పడితే ఎస్సారెస్పీకి నీళ్లు వస్తాయని, అక్కడి నుంచి మిడ్ మానేరుకు వస్తాయని, మిడ్ మానేరు నుంచి పంపులు ఆన్ చేసి నీళ్లు ఇస్తామన్నారు. వ్యాప్కోస్ సంస్థ చెబితేనే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మించామని, మూడు పద్ధతుల ద్వారా నీటిని ఎత్తిపోస్తామని హరీశ్‌రావు చెప్పారు. మేడిగడ్డ గేట్లు ఎత్తకుండా కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీళ్లు ఇవ్వవచ్చు అని ఆయన వివరించారు.
కాళేశ్వరం గురించి అమెరికాలో కేటీఆర్, ఢిల్లీలో కేసీఆర్ గొప్ప చెబుతుంటే అందరూ ఎంతో శ్రద్ధగా విన్నారని చెప్పారు. తెలంగాణకు పూర్వ వైభవం రావాలంటే మళ్లీ విద్యార్థులతోనే ప్రారంభం కావాలన్నారు. తెలంగాణకు నష్టం జరుగుతుందని చెబితే కాంగ్రెస్‌ను ప్రజలు కూకటి వేళ్లతో పెకిలిస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారంతో అధికారంలోకి వచ్చారని వారి మోసాన్ని గ్రామగ్రామాన చెప్పాలని పిలుపునిచ్చారు.
రేవంత్‌కు నిద్రలో కూడా కేసీఆర్ గుర్తుకువస్తున్నారు..
సీఎం రేవంత్‌రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని, అందుకే ఆయన పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదని, ఉద్యమ గుర్తులు, చరిత్ర చెరిపేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ‘తెలంగాణ తల్లిని మార్చారు.. తెలంగాణ లోగోలో కాకతీయ తోరణం తీసేస్తానంటాడు..125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కూడా వేయడు..
మన అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది..కేసీఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమానికి ఊతం ఇచ్చింది..యూనివర్సిటీల్లోని విద్యార్థులే..’అన్నారు. మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షత వహించగా పలువురు నాయకులు పాల్గొన్నారు.