09-08-2025 12:38:53 AM
ఓ కారు, 3 మోటార్ సైకిళ్లు, ౧౦ సెల్‌ఫోన్లు స్వాధీనం
మిర్యాలగూడ. ఆగస్టు 8 (విజయ క్రాంతి) : ఎలాంటి అనుమానాలకు తావు ఇయ్యకుండా అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర మూటను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేసి వారి నుండి 7.4 కిలోల గంజాయి ఒక కారు, మూడు మోటర్ సైకిళ్లు, పది చరవాణిలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన భూక్య హనుమానాయక్, సింగల కాటంరాజు, నరసరావుపేట జిల్లా కారంపూడి కి చెందిన మద్దూరి చంటి అలియాస్ (పోతురాజు)లు మిర్యాలగూడ పట్టణానికి వచ్చి గంజాయిని వారి కస్టమర్లకు విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో వారిని పట్టుకున్నట్టు తెలిపారు.
గంజాయి, మాదకద్రవ్యాలకు అలవాటు పడి న వారు ఒక ముఠాగా ఏర్పడి వారి జల్సాల కొరకు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన బలిమెల వద్ద ఆనంద్ గురు నుండి గంజాయిని కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారన్నారు. అదే క్రమంలో గంజాయి అలవాటు ఉన్న మిర్యాలగూడకు చెందిన కొందరు వ్యక్తులతో వీరికి పరిచయం ఏర్పడి వారి సహకారంతో మిర్యాలగూడలో వారు గంజాయిని కొని ఇతరులకు అధిక ధరలకు విక్రయిస్తు న్నారన్నారు.
అనంతరం వీరు భూక్య హనుమానాయక్, సింగల కాటంరాజు, మద్దూరి చంటి లు రెండు ముఠాలుగా విడిపోయి చంటి తన బైక్ సుమారు రెండు నుండి రెండున్నర కిలో లతో, భూక్య హనుమాన్ నాయక్ కాటం సింగల రాజులు కారులో సుమారు 5 నుండి 5:30 కిలోల గంజాయితో మిర్యాలగూడ టౌన్ కు వచ్చి గంజాయి విక్రయిస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. చంటితో పాటు మిర్యాలగూడ, పరిసర గ్రామాలకు చెందిన షేక్ రియాజ్ మహమ్మద్ అర్హత్ అయూబ్, మహమ్మద్ జునైద్ అలీ, షేక్ అప్రోజ్,కుర్ర సందీప్ లను అరెస్టు చేయగా, ఉప్పలపాడు కు చెందిన భూక్య హనుమాన్ నాయక్ సింగల కాటంరాజు, ఒడిస్సా, మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఆనంద్ గురు, ఎండి సోహిల్, ఎండి నసీరుద్దీన్ సమీర్, శరత్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిపై గతంలో మిర్యాలగూడ 1,2 పోలీస్ స్టేషన్ లలో పలు కేసులు నమోదు అయినట్లుతెలిపారు.
వారిపైఎన్డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా అంతరాష్ట్ర ముఠాను చేదించిన పట్టణ టు టౌన్ సిఐ జె.సోమ నర్సయ్య, గ్రామీణ ఎస్‌ఐ ఎం. లక్ష్మయ్య, టూ టౌన్ ఎస్‌ఐబి రాంబాబు, హెడ్ కానిస్టేబుల్స్ ఎల్. సూ ర, పి. బాలకృష్ణ, ఎండి అక్బర్ బాషా, జి. లక్ష్మయ్య,రాజశేఖర్, సమాద్, వెంకన్న, మహేష్ సైదులు,నాగరాజు, రాము నాయక్, సైదా నాయక్ లను మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు అభినందించారు.