calender_icon.png 9 August, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు అవసరమైనంత మాత్రమే యూరియా బస్తాలను విక్రయించాలి

09-08-2025 12:38:44 AM

వనపర్తి, ఆగస్టు 8 ( విజయక్రాంతి ) : జిల్లాలో రైతులకు అవసరమైనంత మాత్రమే యూరియా బస్తాలను విక్రయించాలని, అవసరానికి మించి అమ్మితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజనగరంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఉన్న ఎరువులను కలెక్టర్ ఆకస్మికం గా తనిఖీ చేశారు. పిఎసిఎస్ లో ఎరువుల విక్రయాలకు సంబంధించిన రిజిస్టర్ ను తనిఖీ చేశారు.

ఒక్కో రైతుకు ఎంత మేర యూరియా బస్తాలను అమ్ముతున్నారనే విషయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇవ్వాల్సిన దానికన్నా అదనంగా యూరియా బస్తాలను విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో రైతులకు అవసరమైనంత మాత్రమే యూరియా బస్తాలను విక్రయించాలని, అవసరానికి మించి అమ్మితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.. మండల వ్యవసాయ అధికారి, సింగిల్ విండో చైర్మన్ రఘు, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.