3 March, 2026 | 7:32 AM

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

03-03-2026 12:49 AM

164 కేజీల గంజాయి, కియా కారు స్వాధీనం

ఎల్బీనగర్, మార్చి 2 : గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నేరస్తులను మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కంటోన్మెంట్ ఎస్వోటీ పోలీసులు, అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ బృందం కలిసి సోమ వారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 41,21,500 విలువైన 164 కేజీల గంజాయి, కీయా కారు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ లోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎల్బీనగర్ డీసీపీ అనురాధ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా దరి యాంబ గ్రామానికి చెందిన నబిన్ సబా ర్(28), అడ్వాజిల్లా అంతరాబా గ్రామానికి చెందిన సుధ్కర్ మం డల్(27) ఇద్దరు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా గంజాయిని రవాణా చేసి, సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఒడిశాలోని బర్మా పూర్ అనే మాదకద్రవ్యాల వ్యాపారితో పరిచయం ఏర్పడింది. ఒడిశా నుంచి మహా రాష్ట్ర, కర్ణాటక ఇతర ప్రాంతాలకు ఒకసారికి గంజాయిని రవాణా చేస్తే రూ.60 వేలు ఇచ్చేవాడు.

భారీగా లాభాలు వస్తుండడంతో మరోసారి హైదరాబాద్ కు గంజాయిని సరఫరా చేయడానికి ఇద్దరు కిరాయికి ఒప్పుకు న్నారు. దీంతో నిందితులు 80 ప్యాకెట్లలో దాచిపెట్టిన 164.86 కిలోల గంజాయిని బ్రౌన్ కలర్ టేప్తో చుట్టి కారు డిక్కీలో వేసుకుని హైదరాబాద్ వస్తుండగా విశ్వసనీయ సమాచారంతో కంటోన్మెంట్ జోన్ ఎస్వోటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారును తనిఖీ చేసి ఆ గంజాయిని  స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.ఎల్బీనగర్ కంటోన్మెంట్, ఎస్వోటీ అదనపు డీసీపీలు మనోహర్, నర్సింహ రెడ్డి, ఎల్బీనగర్ అదనపు డీసీపీ కోటేశ్వరరావు, ఎస్వోటీ అదనపు డీసీపీ కాశిరెడ్డి, అదనపు ఏసీపీ అంజయ్య,  ఎస్వోటీ సీఐ శ్రీనివాస్, అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ అధికారులు తదితరులున్నారు.