29-09-2024 01:31:44 AM
పూజ హెగ్డే కెరీర్‌లో ‘అల వైకుంఠపురములో’ ఇచ్చిన సక్సెస్ కిక్ ఆ తర్వాత కొనసాగలేదు. రెండేళ్ల క్రితం తెలుగు, తమిళంలో వరుస అపజయాలతో హిందీ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిందీ భామ. అక్కడ సల్మాన్‌ఖాన్‌తో ఏరికోరి చేసిన ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’ కూడా పెద్దగా కలిసిరాలేదు. ప్రస్తుతం షాహిద్ కపూర్ దేవాతోపాటు సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబో సినిమాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి.
ఇదిలా ఉండగా పూజకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త తమిళ చిత్రసీమలో వినవస్తోంది. అదేంటంటే ‘కాంచన 4’లో ఈ సొగసరి హీరోయిన్‌గా నటించనుందట. లారెన్స్‌కు ఓకే చెబితే పూజా కొత్త రూట్ తీసుకున్నట్టు అవుతుంది.
ఎందుకంటే ఆమె ఇప్పటిదాకా హారర్ జానర్‌లో నటించిందిలేదు. ప్రముఖ బాలీవుడ్ సంస్థ గోల్డ్ మైన్స్ ‘కాంచన 4’ మీద 100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమయ్యిందని సమాచారం. టీమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేసుకుని ప్రీ ప్రొడక్షన్‌లో బిజీగా ఉంది.