15-07-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ జూలై 14 (విజయ క్రాంతి) : ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపాలని జిల్లా క లెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమంలో 142 మంది తమ ఫిర్యాదులను అందజేశారు. జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశం లో వి విధ అంశాలపై సూచనలు చేశారు.
గ్రామ పరిపాలన అధికారుల నియామకానికి ఆసక్తి ఉన్న వివిధ శాఖలలో పనిచేస్తున్న మాజీ విఅర్‌ఓ లు, విఅర్‌ఏ లు విఏఓ లు ఈ నెల 16 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలియ చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టి వందకు వంద శాతం లక్ష్యాలను సాధించే దిశగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
శాఖల వారీగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.