15-07-2025 12:00:00 AM
హనుమకొండ, జూలై 14 (విజయక్రాంతి): డాక్టర్స్ ఫ్యామిలీలో ఇన్‌స్టా రీల్స్ చి చ్చు పెట్టింది. భార్య, ఇద్దరు కూతుళ్లు ఉండగానే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన యువతి తో ఓ డాక్టర్ ప్రేమాయణం కొనసాగించా డు. ఈ వ్యవహారం డెంటిస్ట్ అయినన తన భార్యకు తెలిసి గొడవలు జరిగాయి. అయి నా ఆ డాక్టర్ ఇన్‌స్టా యువతితో ప్రేమను కొనసాగించడంతో తట్టుకోలేక అతడి భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘట న హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో ఆదివారం సాయంత్రం జరిగింది. కాకతీయ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికవర్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ అల్లాడి సృజన్‌కు 2017లో వరంగల్ మట్టవాడకు చెందిన డాక్టర్ ప్ర త్యూష (ఎన్‌ఎస్‌ఆర్ ఆసుపత్రిలో డెంటిస్ట్) తో వివాహం జరిగింది. వీరికి 2018లో మొ దటి సంతానంగా కూతురు జన్మించింది.
గత జనవరిలో రెండో సంతానంగా రెండో కూ తురు జన్మించింది. అయితే.. ఎనిమిది నెలలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్న ఓ యు వతితో డాక్టర్ సృజన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసినట్టు సమాచారం. ఈ విషయం తెలియడంతో డా క్టర్ ప్రత్యూష, డాక్టర్ సృజన్ మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం హసన్‌పర్తిలో తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.
ప్రత్యూష కుటుంబ సభ్యుల ఫి ర్యాదు మేరకు హసన్‌పర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తన కూతురును మానసికంగా, భౌతికంగా హింసించారని, సృజన్ తల్లిదండ్రులు కూడా కొడుకును మందలించకుండా తమ కూతురినే ఇబ్బందులు పెట్టా రని ప్రత్యూష కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కూతురు మరణా నికి కారణమైన సృజన్‌తో పాటు వారి కు టుంబ సభ్యులను, సదరు ఇన్‌స్టా యువతిని కఠినంగా శిక్షించాలని కోరారు.