09-07-2025 12:25:37 AM
బెజ్జూర్, జూలై8 (విజయ క్రాంతి): మండల కేంద్రంలో ని గిరిజన ఆశ్రమ పాఠశాల ను ఏటీడీవో శ్రీనివాస్ విజ య క్రాంతి దినపత్రికలో మంగళవారం వచ్చిన కథనంపై స్పం దించారు. విజయక్రాంతి దినపత్రికలో పాఠశాలను పట్టించుకునే నాథుడేడి” అనే కథనానికి అధికారులు స్పందించి గిరిజన ఆశ్ర మం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ని వసతుల గురించి ఆరా తీశారు.
పాఠశాల లో అనేక సమస్యలు ఉంటే నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని ప్రధాన ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని ఏటీడీఓ శ్రీనివాస్ తెలిపా రు. చిన్నపాటి సమస్యలను సైతం పరిష్కరించుకోకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడంపై మండిపడ్డారు. పాఠశాల బిల్డింగ్ పై కప్పు నుండి ఊడిపోతున్న పెచ్చులను పరిశీలించారు.
పరిసరాలను సందర్శిం చారు. చెత్తను ట్రాక్టర్ ద్వా రా తరలించి, పరిసరాలను పరిశుభ్రంగా చేసి బ్లీచింగ్ పిచికారి చేశా రు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకో వాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ప్రధానోపాధ్యాయుడిని హెచ్చరించారు. నిర్లక్ష్యం వహించి న ఉపాధ్యాయులకు సోకస్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.
నాలుగు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పాఠశాలలోని సమస్యలను వెలికి తీసి అధికారుల దృష్టికి తీసుకువచ్చినందుకు విజయక్రాంతి దినపత్రిక యాజమాన్యానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట ఎస్‌ఆర్పి వెంకటేశ్వర్, ప్రధానోపాధ్యాయులు బిక్షమయ్య, ప్రసాద్, సిబ్బంది ఉన్నారు.