calender_icon.png 9 July, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక పోరుకు బీజేపీ,కాంగ్రెస్ సన్నద్ధం!

09-07-2025 12:22:04 AM

- ఇన్చార్జిలను నియమించిన కాంగ్రెస్

- పార్టీ నేతలతో బండి సంజయ్‌సమావేశం

కరీంనగర్, జూలై 8 (విజయ క్రాంతి): స్థానిక సమరానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలు గు జిల్లాల్లో పార్టీ సమావేశాలు, ఇంచార్జిల నియామకాలు చేపట్టాయి. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమావేశం నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశా రు. ఈ మేరకు మండల స్థాయిలో పార్టీ ఇం చార్జిలను నియమించే దిశగా కాంగ్రెస్ సన్నద్ధమయింది.

ఇప్పటికే పార్లమెంట్ వారీగా పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు గా పార్టీ ఇంచార్జిలుగా నియమించింది. అనంతరం జిల్లాల వారీగా ఇంచార్జిల నియామకం పూర్తి చేసింది. ఆయా గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న నేతల వివరా లు సేకరించే పనిలో నేతలు పడ్డారు. ఇందు కు ప్రత్యేక ఫార్మాట్ తో కూడిన ఫారాలను సేకరించి వివరాలను సేకరిస్తున్నారు.

మున్సిపాలిటీకంటే ముందు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో ముందుగా గ్రామాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాకు చెందిన మం త్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు నిరంతరం పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికా రంలో ఉన్నందున మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు.

- కరీంనగర్ పార్లమెంట్ పై బండి ప్రత్యేక ఫోకస్...

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మెజార్టీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి నంజయ్ కు మార్ ప్రత్యేక దృష్టి సారించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ మండలాధ్యక్షులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మార్ భేటీ అయి దిశానిర్దేశనం చేశారు. అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.. ఎన్నికల్లో గెలుపు బాధ్యతను భుజాన వేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల అభివృద్ధిలో కేంద్రం పాత్రను ఇంటింటా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ కుమార్‌పిలుపునిచ్చారు.