15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఏది సత్యం ఏద సత్యం?

10-04-2025 12:00 AM

గచ్చిబౌలి పోలీసుల విచారణలో బీఆర్‌ఎస్ నేతలు క్రిశాంక్, దిలీప్

ఏఐ ఫొటోలు, వీడియోల సృష్టిపై విచారణ

నేడు, రేపు హాజరుకానున్న నేతలు

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కంచె గచ్చిబౌలి భూముల కు సంబంధించి ఏఐని ఉపయోగిం చి సోషల్ మీడియాలో నకిలీ ఫొ టోలు, వీడియోలు పోస్టు చేశారం టూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌కు గచ్చిబౌలి పోలీసులు ఈ నె ల 9, 10, 11వ తేదీల్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇ చ్చారు.

ఈ మేరకు బుధవారం మ న్నె క్రిశాంక్, దిలీప్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11:30 గంటలకు పోలీసు ల ఎదుట హాజరయ్యారు. వారిని వి చారించిన పోలీసులు సోదాల నిమి త్తం మొబైల్ ఫోన్లను అడగగా.. ఇం టి వద్దే ఉన్నాయని ఇద్దరూ బదులిచ్చినట్టు సమాచారం. ఏఐ ఫొటోలు, వీడియోలపై బుధవారం రాత్రి వర కు విచారించిన అనంతరం పోలీసు లు వారిని ఇంటికి పంపించారు. కా గా గురువారం, శుక్రవారం కూడా విచారణకు క్రిశాంక్, దిలీప్ హాజరుకానున్నారు. 

కాంగ్రెస్‌వి ద్వంద్వ ప్రమాణాలు: హారీశ్‌రావు

తెలంగాణ పోలీస్ అధికారులు తమ నేతలు కొణతం దిలీప్, క్రిషాంక్‌లను 9గంటలు విచారించడం ప్రజాపాలన అనిపించుకుంటుందా అని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వా న్ని ప్రశ్నించారు. హెచ్‌సియూ విద్యార్థలు, హైదరాబాద్ జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు మద్దతు ఇచ్చారన్నారు. ఇప్పుడు వారి ఫోన్ల కోసం వారి ఇళ్లల్లో రాత్రిపూట సోదాలు చేయడం దారుణమని హారీష్ రావు విమర్శించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహు ల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో విలువలను ఖూ నీ చేయడం కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని మండిపడ్డారు.