నకిలీ ఎన్‌ఓసీలపై విచారణ
- సమర్పించిన కాలేజీలపై కఠిన చర్యలు
- ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు కోరుతూ నకిలీ ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లను (ఫైర్ ఎన్‌ఓసిలను) సమర్పించినట్లుగా తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు (టీజీబీఐఈ) దృష్టికి వచ్చింది. దీంతో సంబంధిత అధికారులు ఆయా యాజమాన్యాలపై చర్యలు ప్రారంభించారు. విద్యా సంస్థలు సమర్పించిన ఫైర్ ఎన్‌ఓసిల ప్రామాణికతను ధృవీకరించడానికి ఇప్పటికే ఒక అంతర్గత విచారణ ప్రారంభించింది.
విచారణ పూర్తయిన తర్వాత, బీఐఈ నిబంధనలను తప్పుదోవ పట్టించినట్లు తేలిన ఏ సంస్థలపైనైనా, వర్తించే నియమ నిబంధనల ప్రకారం తగి న కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నది. ని బంధనలను ఉల్లంఘించినట్లు తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు గురువారం ప్రకటనలో తెలిపింది.
గందర గోళానికి దారితీసే అవకాశం ఉన్న వార్తలు లేదా వదంతులకు ఎవరు ఆందోళన చెందవద్దని తల్లిదండ్రులకు, విద్యార్థులకు, యా జమాన్యాలకు బోర్డు సూచించింది. విద్యార్థుల ప్రయోజనాలను, సంక్షేమాన్ని పరిరక్షించడానికి, అనుబంధ ప్రక్రియ లో పారదర్శకత, జవాబుదారీతనం, చట్టబద్ధమైన నిబంధనలకు కట్టుబడి ఉండేలా బోర్డు కట్టుబడి ఉందన్నారు.






