నిబంధనలకు పాతర!
- జోరుగా అక్రమ ‘సెల్లార్’ తవ్వకాలు
- తుర్కయంజాల్‌లో 1500 మెట్రిక్ టన్నుల పర్మిట్‌తో టన్నుల కొద్దీ దందా..
- ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
- అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
రంగారెడ్డి/ఆదిభట్ల, అగస్టు 6 (విజయక్రాంతి): ఒకవైపు వర్షాకాలం ముంచుకొస్తోంది... మరోవైపు నిబంధనలను నగరంలో కొందరు బిల్డర్లు, మైనింగ్ మాఫియా పాతరేస్తున్నారు. జిహెచ్‌ఎంసి నిబంధనల ప్రకారం వర్షాకాలంలో ప్రమాదకరమైన సెల్లార్ తవ్వకాలను చేపట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, కొందరు బిల్డర్లు, కాంట్రాక్టర్లు అధికారుల అండదండలతో యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. గత ఏడాది ఎల్బీనగర్‌లో సెల్లార్ తవ్వకాల సమయంలో గోడ కూలి పలువురు కూలీలు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మరువకముందే అదే తరహా ముప్పు పునరావృతమవుతోంది.
తుర్కయంజాల్లో భారీ తవ్వకాలు:
అనుమతి కొంత... దోపిడీ అంతా అన్నట్టు ఉంది బిల్డర్ల తీరూ. తుర్కయంజాల్ సర్కి ల్ పరిధిలో ని రాఘవేంద్ర కాలనీలో ప్రస్తు తం జరుగుతున్న ఓ బిల్డర్ చేపడుతున్న భా రీ తవ్వకాలు స్థానికులను భయాందోళనల కు గురిచేస్తున్నాయి. గనుల శాఖ నుంచి కేవ లం 1500 మెట్రిక్ టన్నుల గ్రావెల్ డిస్పాచ్ చేయడానికి తాత్కాలిక పర్మిట్ పొందిన భూ మిలో, పర్మిట్ పరిమితిని మించి తోడేస్తున్నారు.
20-30 అడుగుల లోతు...పర్మిషన్ చి న్నదే అయినా, దాదాపు రెండు నుంచి మూ డు అంతస్తుల లోతుకు తవ్వేస్తూ భారీ గుం తలను ఏర్పాటు చేస్తున్నారు. పక్కనే ఉన్న ని వాసాల పునాదులు దెబ్బతినేలా తవ్వకాలు జరపడంతో సమీప నివాసితులు రాత్రుళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అనుమతికి మించి తవ్విన మట్టి, నిరంతరం వంద లాది వాహనాల్లో తరలిస్తున్నారు. దీనివల్ల మెయిన్ రోడ్డుపై దుమ్ము, ధూళి పేరుకుపో యి వ్యాపారులు, వాహనదారులు అనారో గ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
గత అనుభవాల నుంచి పాఠాలు ఏవి?
గతేడాది ఎల్బీనగర్లో జరిగిన దారుణ ఘ టనే ఇందుకు నిదర్శనం. సరైన రక్షణ చర్య లు తీసుకోకుండా సెల్లార్లు తవ్వడం వల్ల వ ర్షపు నీరు చేరి మట్టి లూజ్ అయి గోడలు కూలి కూలీలు సజీవ సమాధి అయ్యారు. ప్ర స్తుతం వర్షాలు పడుతున్న సమయంలో తు ర్కయంజాల్ ప్రాంతాల్లో ఇటువంటి భారీ తవ్వకాలు మళ్ళీ పెద్ద ప్రమాదానికి బాటలు వేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్లు..
ఈ అక్రమ తవ్వకాలపై స్థానికులు, పర్యావరణ వేత్తలు పలుమార్లు జిహెచ్‌ఎంసి, మైనింగ్ మరియు రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, వెనుక ఉన్న బడా కాంట్రాక్టర్ల హస్తం వల్లే అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. తనిఖీలకు రావాల్సిన అధికారులు సమాచారం ఇస్తూ ముందస్తుగా హెచ్చరిస్తున్నారే తప్ప నిజమైన చర్యలు తీసుకోవడం లేదు.‘ అసలు ఎంత పరిమాణంలో తవ్వకానికి పర్మిషన్ ఇచ్చారు? ఎంత పరిమాణంలో తరలించారు? అనే దానిపై మైనింగ్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా రీ-సర్వే చేయాలి.
తక్షణమే పనులు నిలిపివేయాలి
వర్షాకాలం పూర్తయ్యే వరకు జిహెచ్‌ఎంసి, మున్సిపాలిటీ పరిధిలోని ప్రమాదకర సెల్లార్, భారీ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి.నిబంధనలు ఉల్లంఘించిన బిల్డర్లు, పర్మిట్ పేరిట అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.ఏది ఏమైనా... మరో పెద్ద ప్రమాదం జరిగి అమాయకుల ప్రాణాలు పోకముందే ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ భారీ తవ్వకాల వెనుక ఉన్న ’అసలు కథ’ను బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






