7 August, 2026 | 2:30 AM

సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు

07-08-2026 12:00 AM

మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ సుదర్శన్ రెడ్డి

మేడిపల్లి, ఆగస్టు 6 (విజయక్రాంతి): ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాటిని పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి కనిపించడం లేదు అని మేడ్చల్ నియోజకవర్గం బిజెపి ఇన్ ఛార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు.

గురువారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ మేడిపల్లి 9వ డివిజన్ బీజేపీ కార్యవర్గ సమావేశం డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏనుగు సుదర్శన్ రెడ్డి హాజరై కార్యకర్తలు, నాయకులకు పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం దిశగా పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలు, మెట్రో రైల్ విస్తరణ, విద్యా ర్థుల ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతుల సమస్యలు, పేదలకు సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అనేక కీలక అంశాల ను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

తెలంగాణ ప్రజలు ఎన్నో సమస్యల తో ఇబ్బందులు పడుతున్నా వాటిని పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి కనిపించడం లేదు అని ధ్వజమెత్తారు. అనంతరం బీజేవైఎం నాయకులు బండారు పవన్ రెడ్డి మాట్లాడుతూ మేడిపల్లి డివిజన్ లో బిజెపి గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోనె శ్రీ నివాస్, కార్యదర్శి జైపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గీతారామ్, జిల్లా నాయకులు పల్లె బాలరాజ్ గౌడ్ , కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.