నాడు నిర్లక్ష్యం.. నేడు నివాళులా?
- ప్రొఫెసర్ జయశంకర్‌పై బీఆర్‌ఎస్‌ది ద్వంద్వ వైఖరి
- ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి) : తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్‌ను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ఎన్నోసార్లు అవమానించారని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు ఆరోపించా రు. అప్పుడు నిర్లక్ష్యం చేసి.. ఇప్పుడు ఆకాశానికి ఎత్తుకోవడం బీఆర్‌ఎస్ రాజకీయ ఎత్తుగడల్లో భాగమేనని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో ఓ సందర్భంలో కేసీఆర్, ఫ్రొఫెసర్ జయశంకర్, తాను కలిసి ఉన్నామని గుర్తు చేశారు.
అప్పుడు జయశంకర్‌ను కేసీఆర్ నోటికొచ్చినట్లుగా మాట్లాడారని, ఆయన వ్యవహరిం చిన తీరును చూసి తాను చాలా బాధపడ్డానని వీహెచ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం భరిస్తున్నానని తనతో చెప్పారని వెల్ల డించారు. ఆయన బతికి ఉన్నప్పుడు అవ మానించిన బీఆర్‌ఎస్ నాయకులు.. ఇప్పుడు ఆయనను దేవుడిగా కొలుస్తూ, నివాళుల ర్పించడం విడ్డూరంగా ఉందన్నారు.






