కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన రాచకొండ సీపీ
28-05-2024 01:05 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (విజయక్రాంతి) : లోక్‌సభ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో రాచకొండ కమిషనర్ తరు ణ్‌జోషి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కలిసి రాచకొండ పరిధిలోని ఘట్‌కేసర్ హోలీమేరీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సోమవా రం సందర్శించారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను పరిశీలిం చారు. ఓట్ల లెక్కింపు సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల సిబ్బంది, పోలీసు బలగాలకు సూచించారు. కమిషనర్‌తో పాటు మల్కాజిగిరి డీసీ పీ పద్మజ, అధికారులు పాల్గొన్నారు.






