14 July, 2026 | 4:51 AM

సీఎస్‌ఆర్ అవార్డ్స్‌కు సీఎస్‌కు ఆహ్వానం

14-07-2026 12:33 AM

నారి నిర్మాణ్  ఫౌండర్ అండ్ చైర్మన్ మాదిరెడ్డి జగన్నాథం

ముషీరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (ఐఏఎస్) ను నారి నిర్మాన్ ప్రతినిధుల బృందం కలిసి ‘రైజింగ్ తెలంగాణ సీఎస్‌ఆర్ అవారడ్స్ 2026‘ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని సోమవారం అందజేసింది.

ఈ సందర్భంగా ‘రైజింగ్ తెలంగాణ సీఎస్‌ఆర్ అవారడ్స్2026‘ కార్యక్రమం నిర్వహణ లక్ష్యాలు, కార్యక్రమ విశేషాలను ప్రధాన కార్యదర్శికి వివరించారు. తెలంగాణలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) రంగంలో విశిష్ట సేవలందిస్తున్న సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక సేవకులను ఒకే వేదికపై సత్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా నారి నిర్మాన్ సంస్థ విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని నిరంతరం సేవలందిస్తోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా ప్రయోజన కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే ప్రతినిధి పేరం శివనాగేశ్వర్ గౌడ్, నారి నిర్మాన్ ఫౌండర్ అండ్ చైర్మన్ మాదిరెడ్డి జగన్నాథం, హర్యాస్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్, పవిత్ర మాధిరెడ్డి, నారి నిర్మాన్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కుమార్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.