14 July, 2026 | 4:53 AM

బాలిక ఆరోగ్యంతో చెలగాటం..?

14-07-2026 12:32 AM
  1. ఆర్‌ఎంపీపై డీఎంహెచ్‌ఓకు గ్రామస్తుల ఫిర్యాదు
  2. వైద్య నిర్లక్ష్యంతో బాలిక పరిస్థితి విషమించిందని ఆరోపణ
  3. సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

కొల్చారం జూన్ 13మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన గ్రామస్తులు రంగంపేట గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ కూకట్లపల్లి రాజుపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఓ బాలికకు జ్వరం రావడంతో సంబంధిత ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించగా వైద్య నిర్లక్ష్యం జరిగిందని, దాంతో బాలిక ఆరోగ్యం మరింత క్షీణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి, వైద్య నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తమ ఫిర్యాదులో కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హత లేని వైద్యుల చికిత్స కారణంగా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిర్యాదును స్వీకరించిన జిల్లా వైద్యాధికారులు ఘటనపై విచారణ చేపట్టి, నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.