11-10-2025 08:21:12 AM
పటాన్ చెరు: శివభక్తులు, బ్రహ్మశ్రీ దోర్భల గుణాకర్ శర్మ ఆధ్వర్యంలో సంస్కృతి నిర్మాణ్ ట్రస్ట్ వారు పటాన్ చెరు లో నిర్వహించబోతున్న మహా కోటి దీపోత్సవం కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికను బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ కి ట్రస్ట్ సభ్యులు మర్యాదపూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఈ మహా దీపోత్సవం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు పటాన్ చెరు డివిజన్ పరిధిలోని వాల్యూ మార్ట్ ఎదురుగా జరగనుందని తెలిపారు.
ఆహ్వానాన్ని స్వీకరించిన మాదిరి ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ... లోకహితానికి, సమాజ శాంతి స్థాపనకు దోహదపడే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన సహకారం ఎప్పుడూ అందిస్తాను అని తెలిపారు. అదే విధంగా, నెలరోజుల పాటు మహోన్నతంగా జరగబోయే శ్రీ హరి హరుల మహా కోటి దీపోత్సవం లో పటాన్ చెరు పరిధిలోని ప్రతి భక్తుడు పాల్గొని దీపాలను వెలిగించి పటాన్ చెరు పట్టణ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభను మరింత పెంచాలని ప్రజలను ఆయన కోరారు.