calender_icon.png 11 October, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్​ నేతల జూమ్​ మీటింగ్​.. సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్

11-10-2025 02:19:27 PM

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై(BC reservation) తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు(Supreme Court) వెళ్లనుంది. జీవో 9 అమలు చేయాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరనుంది. సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కాంగ్రెస్ నేతలు శనివారం నాడు జూమ్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింగ్వీతో నేతలు మాట్లాడారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ జీవో నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రేవంత్ రెడ్డి సర్కార్(Revanth Reddy Sarkar) నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్​ లీవ్​ పిటిషన్​ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

హైకోర్టు ఇచ్చిన స్టేను కొట్టేసి స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అనుమతించాలని కోరనుంది.స్థానిక ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో హైకోర్టు జోక్యం సరికాదని తెలంగాణ ప్రభుత్వం(Telangana government) సుప్రీంకోర్టులో వాదించేందుకు సిద్ధమవుతోంది. అటు హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చలు జరిపింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 9,41పై మాత్రమే స్టే ఇచ్చినట్లు ఉత్తర్వులో పేర్కొన్నట్లు తెలిపింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయ నిపుణుల సూచన మేరకు ఎస్ఈసీ తదుపరి నిర్ణయం తీసుకోనుంది. అక్టోబర్ 15న తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు హైకోర్టు తీర్పుపై కేబినెట్‌ చర్చించనుంది.